Sunday, August 14, 2016

2016 వేసవి సినిమాల్లో నిలిచేవెన్ని..?2016 సంక్రాంతికి తెలుగు సినిమాకు ఎక్కడలేని లాభాలు వచ్చాయి.200 కోట్ల బిజినెస్ జరిగితే చాలు అనుకున్నది కాస్తా..ఒక్కసారిగా ఏకంగా 500 కోట్లకు చేరుకుందిసంక్రాంతికి విడుదలైన నేను శైలజానాన్నకు ప్రేమతోసోగ్గాడే చిన్ని నాయినాడిక్టేటర్మరియు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు థియేటర్స్సాటిలైట్ మరియు ఆడియో హక్కులతో కలిపి సుమారు 130 కోట్ల బిజినెస్ జరిగిందని...ఇందులోనే  సుమారు 240  కోట్ల వరకు  సినిమా వసూళ్లు సాగాయని సినీ వర్గాల సమాచారం.

వచ్చే వేసవికాలంకూడా సినీ ప్రియులకు మజానుసినీ వ్యాపారంలో ఉన్న వారికి లాభాలను అందించబోతుంది వేసవికాలంలో దాదాపుగా 30 సినిమాలు విడుదలకాబోతున్నాయిఏఏ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో... బాక్సాఫీస్ రికార్డులనుసాధిస్తాయో తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే...

2016 వేసవిలో వస్తున్న సినిమాలు...
1. బ్రహ్మోత్సవం: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంతో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా బ్రహ్మోత్సవం సినిమా రాబోతుందిగతంలో శ్రీకాంత్ అడ్డాలమహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమా విజయం సాధించడంతో ఈసినిమా పైఅంచనాలు భారీగానే వున్నాయి.
2. సరైనోడు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ సినిమా సరైనోడుఅల్లు అర్జున్బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి దీనిపై కూడా భారీగానే అంచనాలుఉన్నాయి.
3. సర్దార్ గబ్బర్ సింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్పవన్ సొంతంగా స్క్రిన్ ప్లే రాసుకున్న  సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడుసినిమాపై కూడా అభిమాన సినీవర్గాలలో భారీగానే అంచనాలు ఉన్నాయి.
4. .. అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి): నితిన్సమంతా హీరోహీరోయిన్స్ గా  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా .. అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి). టైటిల్ తోనే కొత్త అనుభూతిని అందిస్తున్న సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో..?
5. ఊపిరి: వంశీ పైడపల్లి దర్శకత్వంలో  నాగార్జునకార్తీలు హీరోలుగా నటిస్తున్న సినిమా ఊపిరితమన్న హీరోయిన్ గా నటిస్తున్న  సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.
6. రాబిన్ హుడ్: దామోదర్ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో మాస్ మహరాజు రవితేజ హీరోగా నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాబిన్ హుడ్మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండొచ్చని సినీవర్గాల సమాచారం.
7. ఆక్సిజన్: సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్పై గోపిచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత .ఎమ్రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్రాశీఖన్నా హీరోయిన్ గాజగపతిబాబు విలన్ గా నటిస్తున్న  చిత్రానికి యువన్‌ శంకర్రాజా సంగీతం అందిస్తున్నాడు.
8. బాబు బంగారం: విక్టరీ వెంకటేష్నయనతార జంటగా ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌ టైనమెంట్స్‌ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం.
9. ప్రేమమ్: నాగచైతన్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రేమమ్మళయాళ సినిమా ప్రేమమ్ కి రిమేక్ ఇదిగతకొంతకాలంగా సరైన హిట్ లేని నాగచైతన్యకు  చిత్రమైనా విజయం అందిస్తుందేమో చూడాలి.
10. కబాలి: సూపర్ స్టార్ రజనీకాంత్ డాన్ కనిపించబోతున్న చిత్రం కబాలిరజనీ నటించిన బాషా చిత్రంలా  చిత్రం వుండబోతుందన్న వార్త రావడంతో రజనీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
11. పండగలా వచ్చాడు: నారా రోహిత్నీలమ్ ఉపాధ్యాయ జంటగా కార్తీకేయ ప్రసాద్ దర్శకత్వంలో తొండపు నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం పండగలా వచ్చాడురొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపోందుతున్న  సినిమాకు అనూఫ్ రుబెన్స్ సంగీతంఅందిస్తున్నాడు.
12. సుప్రీమ్: ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ సారధ్యంలో సాయిధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా హీరోహీరోయిన్స్ గా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సుప్రీమ్‌.  ఫ్లాప్స్ తో ఉన్న సాయిధరమ్‌ కి  చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
13. ఆటడుకుందాం రా: జినాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో  సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  ఆటాడుకుందాం రాసుశాంత్ నటించిన కరెంట్ సినిమా తప్ప మరేవి విజయం సాధించలేదు సారైనా హిట్ సాధిస్తాడో..?
14. ఈడు గొల్ట్ ఎహే: వీరు పొట్ల దర్శకత్వంలో సునిల్ హీరోగా .కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సినిమా ఈడు గోల్డ్ ఎహేకమేడియన్ నుండి హీరోగా మారిన సునిల్ కు మంచి విజయం రాలేదుమరి దీనీ ఫలితం ఎలాఉండబోతుందో..?
15. సాహసం శ్వాసగా సాగిపో: గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపోరొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
16. సూర్య 24: సూర్య హీరోగా వస్తున్న చిత్రం సూర్య 24. వెరైటీ చిత్రాలు చేసే సూర్య చేస్తున్న కొత్త సినిమా ఇదిసైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న  చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
17. సావిత్రి: బిరాజేంద్రప్రసాద్ నిర్మాణ సారధ్యంలో పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్నందిత హీరోహీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం సావిత్రియాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  సినిమాకు శ్రవణ్ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment