Saturday, May 20, 2017

లండన్ లో డొక్కా సీతమ్మ ఛాయాచిత్రం (రవి పారేపల్లి గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)

డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో వుండేవారు. తమ ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండుగా భోజనం పెట్టేవారట. ఆరోజుల్లో బ్రిటిష్ రాణి , డొక్కా సీతమ్మ గారి గుంరించి విని తన పట్టాభిషేకం సమయానికి సీతమ్మ గారిని తీసుకువెళ్లాలని అలోచించారు. కానీ సీతమ్మ గారు సముద్రం దాటి వెళ్ళరు కనుక, గోదావరి జిల్లా కలెక్టర్ ను సీతమ్మ గారి గ్రామానికి పంపి, ఆమె ఫోటో లండన్ పంపమని కలెక్టర్ ని ఆదేశించారు. కలెక్టర్ గారు సీతమ్మ గారి వద్దకు వెళ్లి ఆమె ఫోటో కోసం అడిగితే వల్ల కాదన్నారు ఆమె. అప్పుడు కలెక్టర్ గారు ఆవిడ కాళ్ళ వెళ్ళా పడి, అమ్మా మీరు నాకు ఫోటో ఇవ్వకపోతే నా వుద్యోగం ఊడుతుందని చెప్పటంతో సీతమ్మగారు ఫోటో తీయించుకున్నారు. ఆ విధంగా సీతమ్మగారి ఫోటో బ్రిటిష్ రాణి వద్దకు లండన్ చేరింది. రాణి తన పట్టాభిషేకం రోజు సీతమ్మగారి ఫోటోను ప్రక్కనే ఉంచుకుని పట్టాభిషేకం చేయించుకున్నారట. మిత్రులు చాలా మంది ఈ ఫోటో చూసి ఉండరు. అందుకోసం ఇక్కడ పొందుపరచడం జరిగింది.