Sunday, August 14, 2016

"బొమ్మల రామారం" రివ్యూ



కథ:
బొమ్మల రామారం అనే ఒక ఊరు. రామన్న ఆ ఊరికి చిన్న దొర. ఆఖరి దొరగా చెప్పుకునే రామన్న దొరతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఓ గడీ. అధికారం, ఆస్తికోసం తండ్రినే చంపి రెండు రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్న కిరాతకుడు. తరాలుగా వస్తోన్న ఆస్తిని, పదవులను అనుభవించాలనుకుంటున్న రామన్న, తన తండ్రి స్థానంలో బై ఎలక్షన్లలో నిలబడతాడు. కానీ ప్రజాబలంతో పాటు రామన్న తండ్రికి రైట్ హ్యాండ్ గా ఉన్న లింబన్న ఆ సీట్ తనకివ్వమని చెబుతాడు. రామన్న దగ్గర ఉండే గణేష్ మాటలు విని తనే పోటీకి దిగుతాడు రామన్న. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేసి బతుకుతూ, దుబాయ్ వెళ్ళాలన్ననుకుంటున్న సూరి అనే యువకుడిని, రామన్న తన వర్గంలో చేర్చుకుంటాడు. లింబన్న వర్గం నుంచి వచ్చి పరోక్షంగా రామన్న గెలుపుకోసం కృషి చేస్తాడు సూరి. సంగమిత్ర అనే ఆర్నతాలజిస్ట్ బొమ్మలరామారానికి వస్తుంది. మొదటి చూపులోనే నచ్చిన సంగమిత్రను సూరి ప్రేమిస్తాడు.  అదే సమయంలో బొమ్మల రామారం పక్కన కట్టే ప్రాజెక్ట్ కు రెవిన్యూ ఆఫీసర్ గా వచ్చిన కార్తీక్ తో సంగమిత్ర ప్రేమలో పడుతుందీ. అయితే తన భూముల వ్యవహారంలో జోక్యంచేసుకున్న కార్తీక్ ను చంపించి, ఆ హత్యా నేరాన్ని సూరిపై మోపేలా చేస్తాడు రామన్న. ఎదురు తిరిగిన సంగమిత్రను ను కిడ్నాప్ చేయించి, ఆ అమ్మాయి అత్యాచారానికి గురయ్యేందుకు పరోక్షంగా కారణమవుతాడు. అయితే జైలు నుంచి వచ్చిన సూరి.. రామన్నకు ఎదురు తిరిగి, ఈ సంగమిత్రను ఎమ్మెల్యేను చేస్తానంటూ సవాల్ విసురుతాడు. మరి ఆ సవాల్ లో ఎవరు గెలిచారు. ఆమె ఎమ్మెల్యే అయిందా లేదా.. అసలు ఆ ఊరికి రామన్న చివరి దొర అని ఎందుకు చెబుతున్నారు అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మంచి కథను ఎంచుకున్న దర్శకుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అయితే, గ్రామీణ నేపథ్యం, అక్కడి రాజకీయాలూ, దొరతనం నుంచి పుట్టే క్రైమ్ చుట్టూ ఓ సినిమా చేయాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు. కానీ, చెప్పదలుచుకున్న అంశం, దానికి సంబంధించిన నేపథ్యం తప్ప సినిమాలో బలమైన కథ లేకపోవడంతో సినిమా మొత్తం గజిబిజిగా ఉంది. మొత్తం సన్నివేశాలను అతికించినట్లు కనిపించింది.  రకరకాల పాత్రలు, ఏపాత్ర ఎందుకు వస్తుందో, ఎవరికి ఏమవుతారో అర్థంకాదు. క్లారిటీ లేని అనవసరమైన పాత్రలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికి సరైన క్లారిటీ లేదనేది ప్రతి సీన్ లో స్పష్టమవుతుంది.  గ్రామం అంటే ఇలాగే ఉంటుందనేలా లొకేషన్స్ ఆకట్టుకున్నా.. ఇప్పటికీ గ్రామస్తులు అలాగే ఉన్నారనేలా వారి ఆహార్యాలు అస్సలు బాలేదు. ఇక దొర గడీల్లో జరిగే రాజకీయాలను బాగా చూపించే ప్రయత్నం చేసినా.. వాటి చుట్టూ ఉన్న సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అవీ తేలిపోయాయి. అక్రమ సంబంధాలు అనేది గ్రామాల్లో సర్వసాధారణం అన్నట్టుగా చూపించారు.  ఉమాదేవి అనే పాత్ర, ఆ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు అనవసరం అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరగడం కూడా బోరింగ్‌గా అనిపించింది. రామాయణం నాటకం వేసే సన్నివేశాలు బాగున్నాయి. సంగమిత్రను అత్యాచారం చేసే సన్నివేశం అనవసరం అనిపిస్తుంది. రామన్న తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, అతన్ని కాపురం చేయమనడం అత్యంత అనైతికంగా అనిపించిన సీన్. సూరి పాత్రలో కంటిన్యుటీ మిస్సయింది. ఒక సీన్ లో జుట్టు గడ్డంతోఉన్న సూరి, ఆ తరువాతి సీన్ లో తకు్కవ జుట్టు గడ్డంతో కనిపిస్తాడు. దీనివల్ల రెండు సీన్లలోని నటుడు ఒకడేనని తెలుసుకోవడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పట్టింది. జైలు నుంచి వచ్చిన సూరి క్లైమాక్స్ లో, సంగమిత్రను అత్యాచారం చేసిన వాళ్లను చంపే విధానం (కత్తులతో గొంతులు కోయడం వంటివి) చాలా సిల్లీగా ఉంది. చివర్లో తుపాకులతో కాల్చుకోవడం కూడా అలానే ఉంది.

నటన:
నటులంతా చాలా బాగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి వీళ్లంతా కొత్తవాళ్లు కావడం గమనించదగ్గ విషయం.  రామన్నగా నటించిన ప్రియదర్శి నటన చాలా స్టేబుల్ గా ఉంది. అలాగే సూరి నటన కూడా బాగుంది. సూరి ఫ్రెండ్ మల్లేశ్ గా నటించిన తిరువీర్ నటనకూడా బాగుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ సినిమాలో కొంతలోకొంత హస్యం పుట్టించాడు. ముఖ్యంగా రామాయణం నాటిక సన్నివేశంలో వాలి పాత్రలో తిరువీర్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించాయి. తన ప్రెండ్ కోసం మొసలితో ఫైట్ చేసే సీన్లో అద్భుంతగా నటించాడు. అంజిగా నటించిన మోహన్ భగత్ నటన కూడా ఆకట్టుకుంది.  మిగతా నటులంతా బాగానే నటించారు. అయితే, వారి నటనకు తగ్గ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడం వల్ల వారి నటనంతా వృధాగా పోయింది. కానీ, వీళ్లకు ఓ మంచి సినిమా పడితే సహజ నటనతో చెలరేగిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సాంకేతిక విభాగం:
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్రఫీకి ఇవ్వొచ్చు. కృష్ణ మాయ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కార్తీక్ కొడగండ్ల అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు. ఎడిటింగ్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌లలో ఒకటిగా చెప్పాలి. ఎడిటింగ్ సినిమాకు ఉన్న స్థాయిని కూడా తగ్గించింది.

ప్లస్ పాయింట్స్:
గ్రామీణ నేపథ్యం
నటన
సూరి, తిరువీర్ మధ్య ఉన్న సన్నివేశాలు
తిరువీర్ కామెడీ
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ, కథనం
అనవసర పాత్రలు, సన్నివేశాలు
నటీమణులు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఎడిటింగ్
క్లైమాక్స్ లో వచ్చే ఫైట్

చివరగా:
మొదటి సినిమాకే దర్శకుడు నిశాంత్ చేసిన సాహసం, ఎంచుకున్న  నేపథ్యం బాగానే ఉంది. అయితే,  కథ మీద పూర్తి స్థాయి పట్టు, ఒక్కో పాత్ర మీద తిరుగులేని క్లారిటీ వల్ల ఈ సినిమా ఎటూ కాని సినిమాగానే మిగిలింది. ఆకట్టుకునే గ్రామీణ వాతావరణం, దానికి తగ్గట్టు సరైన సినిమాటోగ్రఫీ, నటుల నటన బాగా ఉండడంతో ఒకసారి చూసిరాగల సినిమా. 

నటీనటులు: సూరి, తిరువీర్, ప్రియదర్శి, మోహన్ భగత్, భార్గవ రామ్, కె. సంకీర్తన, రూపారెడ్డి, అభయ్, విమల్ క్రిష్ణ, జ్యోతివర్మ, 
సంగీతం: కార్తీక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: అమరనాథ్ రెడ్డి, నిర్మాత: పుదారి అరుణ, రచన, దర్శకత్వం: నిశాంత్ పుదారి
విడుదల తేదీ: ఆగష్టు 12, 2016
రేటింగ్: 2.25/5

చీకట్లోంచి వెలుగుకు నడిపిన అతల కుతల పాతాళం



"నిత్యం సుడిగుండం
సమయంతో సమరం చేసేయ్ సాగర మథనం 
నిన్నే నువ్వు శోధించుకుంటూ...
నిన్నే నువ్వు సాధించుకుంటూ...
నిన్నే నువ్వు శాసించుకుంటూ...
నీకై నిన్ను గెలిపించుకుంటూ...
సాగిపో... సాగిపో... సాగిపో...!!!
అతల కుతల పాతాళం... అయోమయం ఈ భూగోళం...."

చీకట్లోనే ఉండాలనుకుంటే ఆ చీకటి నిన్ను కదపదు... వెలుగు కావాలనుకుంటే మాత్రం ఒక అడుగు వేయకతప్పదు. అదే పని శ్రవణ్ పండ్రంగి చేశాడు. తను అందరిలా చీకట్లో ఉండకుండా వెలుగు కోసం అడుగు ముందుకేశాడు. ఆ అడుగు ఫలితమే ''అతల కుతల పాతాళం'' అనే షార్ట్ ఫిలీం.

శ్రవణ్... 29 సంవత్సరాల ఈ కుర్రాడు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే. ఎం.టెక్ చదువుతున్న శ్రవణ్ కి ఫోటోగ్రఫి అంటే పిచ్చి. దాంతో 2011లో ఎం.టెక్ కి స్వస్తి చెప్పి కొన్ని ఫీచర్ ఫిలీంలకు, షార్ట్ ఫిలీంలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా చేశాడు. అనంతరం ''అప్పారావు గారి అబ్బాయిని'' అనే షార్ట్ ఫిలీంకు కెమెరామెన్ గా పనిచేశాడు. మాటివీ నిర్వహించిన పోటీలో ఆ షార్ట్ ఫిలీంకు మూడవ బహుమతి వచ్చింది. అటుతర్వాత 2014లో తనకులాగే ఉత్సాహం ఉన్న శ్రీమాన్ (దర్శకుడు మరియు కెమెరామెన్) తో పరిచయం జరిగింది. ఇద్దరు కలిసి 'శ్రవణ్ శ్రీమాన్ విజువల్స్' అనే బ్యానర్ ని ప్రారంభించి, పనోరమా అనే 15 నిముషాల నిడివి గల మూకీ షార్ట్ ఫిలీంను తీశారు. అతల కుతల పాతాళం వీరి రెండవ ప్రాజెక్టు.

అతల కుతల పాతాళం.. ఒక తండ్రి, ఇద్దరు కొడుకుల కథ. తండ్రి చిరుద్యోగి. చదువులు అయిపోయిన ఇద్దరు కొడకులకు, తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగాలు ఇప్పించి వారి భవిష్యత్ తీర్చిదిద్దాలనుకుంటుంటాడు. కానీ, వారిద్దరికి ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. పెద్దవాడు కథలు రాస్తుంటాడు. చిన్నవాడు నాటకసంస్థలో యాక్టింగ్ నేర్చుకుంటుంటాడు. కానీ, ఈ విషయం తండ్రకి చెబితే ఏమంటాడో అన్న భయంతోనే, ఒకరోజున తన తండ్రికి చెప్పేస్తారు. అది విన్న తండ్రి, కొడుకులను వారి నిర్ణయానికి వదిలేసి వాళ్ల భవిష్యత్తు గురించి బాధపడుతుంటాడు. కొన్నిరోజుల తరువాత... పెద్దొడు రాసిన కథతో ఒక నాటకం తయారుచేసి, ఆ నాటక ప్రదర్శనకు తండ్రిని ఆహ్వానిస్తారు. అయిష్టంగానే వెళ్లిన తండ్రి నాటక ప్రదర్శనలో తన కొడుకుల ప్రతిభలను చూసి పుత్రోత్సాహంతో చప్పట్లు కొడుతాడు.

తల్లిదండ్రులు తమ కోరికలను తమ పిల్లలకు రుద్దొద్దని, వారికి ఇష్టమున్న రంగంలోకి వారిని పంపించాలని చెబుతూనే... పిల్లలు కూడా తమ ఇష్టాలను వారివారి తల్లిదండ్రులకు చెప్పాలని తెలియజేసింది. ప్రతివాడికి ఒక లక్ష్యం, ఇక విజన్ ఉంటుందని అది తెలసుకోని దానికోసం ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని చూపించింది.

టెక్నాలజీ పెరిగిన తరువాత ఎవరు పడితేవారు షార్ట్ ఫిలీంలను తీస్తున్నారు. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రొఫెషనల్ గా ఉంటున్నాయి. ఆ కొన్నింటిలో ఒకటే ఈ అతల కుతల పాతాళం. కంటెంట్ తెలిసినదే అయిన కథను నడిపించిన విదానం బాగుంది. ఫోటోగ్రఫి, మ్యూజిక్ కూడా బాగున్నాయి. లైటింగ్ ప్రోపెషనల్ గా ఉంది. ఇక నటన విషయానికొస్తే నటులందరూ బాగానే చేశారు. మల్లాది గోపాలకృష్ణ గారు చెప్పిన వాయిస్ వోవర్, ఆ వాయిస్ వోవర్ మీద వచ్చన ఆర్ట్ వర్క్ బాగుంది.

మోహన్ శివలెంక, తిరువీర్, పవన్ రమేష్, శ్రీనివాసరావు పోలుదాసు, నయీమ్, రోహిత్ కుమార్ నటించిన ఈ షార్ట్ ఫిలింకు ఆర్ట్: క్రాంతి ప్రియం, సినిమాటోగ్రఫి: శ్రీమాన్ కీర్తి, ఎడిటింగ్: వెంకట్ కళ్యాణ్, మ్యూజిక్: అశిక్ అరుణ్, రచన మరియు దర్శకత్వం: శ్రవణ్ పండ్రంగి.

ఇంక ఆలస్యమెందుకు మీరు కూడా అతల కుతల పాతాళం పై ఓలుక్కేయండి.

అతల కుతల పాతాళం (అతల కుతల పాతాళం వీడియో లింక్)

2016 వేసవి సినిమాల్లో నిలిచేవెన్ని..?



2016 సంక్రాంతికి తెలుగు సినిమాకు ఎక్కడలేని లాభాలు వచ్చాయి.200 కోట్ల బిజినెస్ జరిగితే చాలు అనుకున్నది కాస్తా..ఒక్కసారిగా ఏకంగా 500 కోట్లకు చేరుకుందిసంక్రాంతికి విడుదలైన నేను శైలజానాన్నకు ప్రేమతోసోగ్గాడే చిన్ని నాయినాడిక్టేటర్మరియు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు థియేటర్స్సాటిలైట్ మరియు ఆడియో హక్కులతో కలిపి సుమారు 130 కోట్ల బిజినెస్ జరిగిందని...ఇందులోనే  సుమారు 240  కోట్ల వరకు  సినిమా వసూళ్లు సాగాయని సినీ వర్గాల సమాచారం.

వచ్చే వేసవికాలంకూడా సినీ ప్రియులకు మజానుసినీ వ్యాపారంలో ఉన్న వారికి లాభాలను అందించబోతుంది వేసవికాలంలో దాదాపుగా 30 సినిమాలు విడుదలకాబోతున్నాయిఏఏ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో... బాక్సాఫీస్ రికార్డులనుసాధిస్తాయో తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే...

2016 వేసవిలో వస్తున్న సినిమాలు...
1. బ్రహ్మోత్సవం: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంతో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా బ్రహ్మోత్సవం సినిమా రాబోతుందిగతంలో శ్రీకాంత్ అడ్డాలమహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమా విజయం సాధించడంతో ఈసినిమా పైఅంచనాలు భారీగానే వున్నాయి.
2. సరైనోడు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ సినిమా సరైనోడుఅల్లు అర్జున్బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి దీనిపై కూడా భారీగానే అంచనాలుఉన్నాయి.
3. సర్దార్ గబ్బర్ సింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్పవన్ సొంతంగా స్క్రిన్ ప్లే రాసుకున్న  సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడుసినిమాపై కూడా అభిమాన సినీవర్గాలలో భారీగానే అంచనాలు ఉన్నాయి.
4. .. అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి): నితిన్సమంతా హీరోహీరోయిన్స్ గా  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా .. అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి). టైటిల్ తోనే కొత్త అనుభూతిని అందిస్తున్న సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో..?
5. ఊపిరి: వంశీ పైడపల్లి దర్శకత్వంలో  నాగార్జునకార్తీలు హీరోలుగా నటిస్తున్న సినిమా ఊపిరితమన్న హీరోయిన్ గా నటిస్తున్న  సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.
6. రాబిన్ హుడ్: దామోదర్ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో మాస్ మహరాజు రవితేజ హీరోగా నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాబిన్ హుడ్మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండొచ్చని సినీవర్గాల సమాచారం.
7. ఆక్సిజన్: సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్పై గోపిచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత .ఎమ్రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్రాశీఖన్నా హీరోయిన్ గాజగపతిబాబు విలన్ గా నటిస్తున్న  చిత్రానికి యువన్‌ శంకర్రాజా సంగీతం అందిస్తున్నాడు.
8. బాబు బంగారం: విక్టరీ వెంకటేష్నయనతార జంటగా ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌ టైనమెంట్స్‌ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం.
9. ప్రేమమ్: నాగచైతన్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రేమమ్మళయాళ సినిమా ప్రేమమ్ కి రిమేక్ ఇదిగతకొంతకాలంగా సరైన హిట్ లేని నాగచైతన్యకు  చిత్రమైనా విజయం అందిస్తుందేమో చూడాలి.
10. కబాలి: సూపర్ స్టార్ రజనీకాంత్ డాన్ కనిపించబోతున్న చిత్రం కబాలిరజనీ నటించిన బాషా చిత్రంలా  చిత్రం వుండబోతుందన్న వార్త రావడంతో రజనీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
11. పండగలా వచ్చాడు: నారా రోహిత్నీలమ్ ఉపాధ్యాయ జంటగా కార్తీకేయ ప్రసాద్ దర్శకత్వంలో తొండపు నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం పండగలా వచ్చాడురొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపోందుతున్న  సినిమాకు అనూఫ్ రుబెన్స్ సంగీతంఅందిస్తున్నాడు.
12. సుప్రీమ్: ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణ సారధ్యంలో సాయిధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా హీరోహీరోయిన్స్ గా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సుప్రీమ్‌.  ఫ్లాప్స్ తో ఉన్న సాయిధరమ్‌ కి  చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
13. ఆటడుకుందాం రా: జినాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో  సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  ఆటాడుకుందాం రాసుశాంత్ నటించిన కరెంట్ సినిమా తప్ప మరేవి విజయం సాధించలేదు సారైనా హిట్ సాధిస్తాడో..?
14. ఈడు గొల్ట్ ఎహే: వీరు పొట్ల దర్శకత్వంలో సునిల్ హీరోగా .కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సినిమా ఈడు గోల్డ్ ఎహేకమేడియన్ నుండి హీరోగా మారిన సునిల్ కు మంచి విజయం రాలేదుమరి దీనీ ఫలితం ఎలాఉండబోతుందో..?
15. సాహసం శ్వాసగా సాగిపో: గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపోరొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
16. సూర్య 24: సూర్య హీరోగా వస్తున్న చిత్రం సూర్య 24. వెరైటీ చిత్రాలు చేసే సూర్య చేస్తున్న కొత్త సినిమా ఇదిసైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న  చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
17. సావిత్రి: బిరాజేంద్రప్రసాద్ నిర్మాణ సారధ్యంలో పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్నందిత హీరోహీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం సావిత్రియాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  సినిమాకు శ్రవణ్ సంగీతం అందిస్తున్నాడు.