Sunday, August 14, 2016

’కీచక’ సినిమా రివ్యూ



‘‘కౄరమృగం గ్రామంలోకి వస్తే ఆ మృగాన్ని చూసి భయపడి పారిపోకూడదు... దానికి ఎదురు తిరిగి గెలవాలి’’ అన్న సూక్తితో... శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి. చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వతరెడ్డి నిర్మించిన చిత్రం కీచక.  యామినీ భాస్కర్జ్వాలా కోటిరఘుబాబుగిరిబాబువినోద్‌, రోజా. అనూషమాధవి, శ్రీనివాసులు నాయుడుశ్రీకాంత్‌ ఆరేపల్లిఅభిషేక్‌ గార్లపాటిచంద్రశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ 2015,  అక్టోబర్ 30న విడుదలయింది.

ఎడిటర్: మేడికొండ రాంబాబుకో-డైరెక్టర్: జి. రామస్వామిక్రియేటివ్ హెడ్: సిరి చందనపాటలు: గోరటి వెంకన్నవెన్నెలకంటిరామజోగయ్య శాస్త్రిమాటలు: రాంప్రసాద్ యాదవ్సంగీతం: డా. జోశ్యభట్లఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: మోహన్ రావిపాటి,  కెమెరా: కమలాకర్నిర్మాత: కిషోర్ పర్వతరెడ్డి,కథస్క్రీన్ ప్లేదర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి.

కథ
అది గాంధీనగర్ బస్తీ... ఆ బస్తీలో ఒక నరరూప రాక్షసుడు. అతడి పేరు కోటి (జ్వాలా కోటి). కనిపించిన ఆడవాళ్ళందరిని రేప్ చేస్తుంటాడు. అతడి దురాగతాలకు స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు అండగా ఉండడంతో బస్తీవాసులు కోటిని, అతడి ఆగడాలను భరించడమే తప్ప ఏం చేయలేకపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కోటిని చంపేందుకు సుజాత (యామినీ భాస్కర్) అనే అమ్మాయి బస్తీకి వస్తుంది. కోటి కన్ను సుజాతపై పడుతుంది. తనపై అత్యాచారం చేయబోతున్న కోటిపై ఎదురుతిరుగుతుంది. ఆ దశలో కోటి బలహీనత తెలుసుకుంటుంది. బస్తీవాళ్లందరిలో ధైర్యం నింపి... వాళ్ల సహాయంతో కోటిని హతమారుస్తుంది. ఇంతకి సుజాత ఎవరు..? కోటిని ఎందుకు చంపాలనుకుంటుంది..? కోటి బలహీనత ఏంటి..? కోటిని ఎలా చంపింది..? అన్నదే మిగత కథ....

సాంకేతికాంశాలు
కథ- కథనం: నాగపూర్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. అయితే నిజ సంఘటనను యధాతదంగా చిత్రికరించడంలో దృష్టి పెట్టిన దర్శకుడు కథనం విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. రిపీట్ సీన్లు రావడం, కొన్ని సన్నివేశాల్లో కాంప్లిక్ట్ లేకపోవడంతో కాస్త బోర్ కొడుతుంది.

సంభాషణలు:‘‘కౄరమృగం గ్రామంలోకి వస్తే ఆ మృగాన్ని చూసి భయపడి పారిపోకూడదు... ఆ మృగానికి ఎదురు తిరిగి గెలవాలి’’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

సంగీతం-పాటలు: పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది.

ఎడిటింగ్: అక్కడక్కడ కొన్ని లెంతీగా అనిసించాయి. అటువంటి సీన్లను ట్రిమ్ చేస్తే బాగుండేది.

కెమెరా: కెమెరా వర్క్ చాలా బాగుంది. సన్నివేశానుకూలంగా వివిధ రకాల యాంగిల్స్ తో న్యాయం చేశాడు.

నటన: నటనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కీచక పాత్రధారి జ్వాలా కోటి గురించి. రేపిస్ట్ పాత్రలో జీవించాడు. నెగటివ్ షేడ్స్ మరియు ఫేస్ లో క్రూరత్వాన్ని చాలా బాగా చూపించాడు. తెలుగుకు మంచి విలన్ దొరికాడని చెప్పచ్చు. సుజాత పాత్రధారి యామిని భాస్కర్ అమాయకత్వంఅందం,కోపం ఇలా కలగలిపిన అన్ని హావభావాలను చాలా బాగా పలికించింది. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఆక్రోశం చూపడంలో విఫలమైంది. అనుభవం కల నటి అయితే సన్నివేశాలు మరింత పండేవి. ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు చేసింది కొద్ది సీన్స్ అయినా చాలా బాగా చేసారు. సైకిల్ మీద క్యారియర్‌లో అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపుఆయన నటన బాగున్నాయి. లచ్చమ్మగా రోజా నటన బాగుంది. ఇలాంటి పాత్రలో నటించడం సాహసమనే చెప్పాలి. హాస్పిటల్ సీన్ లో తన నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. మిగతా నటులు తమతమ పరిధి మేరకు నటించారు.

దర్శకత్వం: యధార్దం సంఘటనలను సీన్స్ గా మార్చుకునే క్రమంలో కొంత డాక్యుమెంటరీ వాతావరణం ఏర్పడి, డ్రామా తగ్గినా... తొలి చిత్రానికే ఇలాంటి కథని ఎంచుకున్న దర్శకుడు సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే సినిమాలో ఎక్కువశాతం కృరత్వమే కనిపిస్తుంది. అయితే ‘‘ఒక నరరూప రాక్షసుడి గురించిన సినిమా కాబట్టి ఆమాత్రం దారుణంగా వాడి రాక్షసత్వాన్ని చూపించకపోతే ఎమోషన్స్ క్యారీ అవ్వదు’’ అని చిత్ర యూనిట్ చెప్పిన మాట వాస్తవం అనిపించింది. డెలాగ్స్ అక్కడక్కడ నాన్ సింక్ అయ్యాయి. అయితే నటీనటుల నుంచి మంచి నటననే రాబట్టాడు. మంచి కమర్షియల్ సబ్జెక్టుని బాగా డీల్ చేయగలరని కొన్ని సీన్స్ చూస్తూంటే అనిపిస్తుంది. టెక్నిషియన్స్ నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టితక్కువ బడ్జెట్ లో టెక్నికల్ విలువలతో కూడిన చిత్రం ఇచ్చారు.

చివరగా: సినిమా మొదలైన 30 నిమిషాలలోనే హీరోయిన్ లక్ష్యమేమిటోదానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో ఆసక్తి తగ్గిపోతుంది. ఈ సినిమాలో మొత్తం 16 రేప్ సీన్లు ఉన్నాయి...కొన్ని కొన్ని సీన్లు పరిధులను దాటిపోయాయి. హింస తగ్గించిఎమోషన్ కంటెంట్ పెంచిక్లైమాక్స్ లో హడావిడి తగ్గించి మరింత ఎఫెక్టివ్ గా చూపి ఉండే ఖచ్చింతంగా ఎక్కువ మందిని ఆకర్షించే చిత్రం అయ్యేది. అయినాకాని యధార్ధ సంఘటనలు తెరపై చూడటంలో ఆసక్తి చూపేవారికి ఈ చిత్రం మంచి ఆప్షనే.

రేటింగ్: 3/5 (ఇది నా అభిప్రాయం మాత్రమే)

No comments:

Post a Comment