Sunday, August 14, 2016

‘‘ఎ-ఫైర్’’ రివ్యూ



NTFI… New Telugu Film Industry… ఈ మధ్యకాలంలో బాగా ప్రాచూర్యం పొందుతున్న నూతన విధానం. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిని ముందుకు తీసుకొచ్చాడు. తక్కువ బడ్జెట్ (10 లక్షలలోపు) లో సినిమాలు తీయడం ఈ NTFI ముఖ్యోద్ధేశ్యం. వర్మ రూపొందించిన ఐస్ క్రీం, ఐస్ క్రీం-2 సినిమాలు ఈ కోవకు చెందినవే. అలా NTFI విధానంలో రూపొందిన సినిమా ’’-ఫైర్‘‘తెలుగులో మెదటిసారిగా ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీరాజన్ దర్శకత్వం వహించాడు. ఐస్ క్రీం, ఐస్ క్రీం-2 చిత్రాల నిర్మాత తుమ్మలప‌ల్లి రామ‌స‌త్యానారాయ‌ణ‌ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కమిటీ మధ్య నలిగి నలిగి చివరకు....నవంబర్ 27, శుక్రవారం రోజున విడుదలైంది. విడుదలకు ముందు నుంచే ఒక ప్రత్యేకమైన సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ‘ఎఫైర్‌’ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం...

కథ
సన్నీ (ప్రశాంతి), అలెక్స్ (గీతాంజలి) ఫ్రెండ్స్. తనను తాను మగాడిలా ట్రీట్ చేసుకుంటున్న సన్నీ... అలెక్స్ ను ప్రేమిస్తుంది. తన పేరెంట్స్ ను చూడడానికి ఇంటికి బయలుదేరుతున్న అలెక్స్ సన్నీని కూడా తనతోపాటు తీసుకెలుతుంది. అడవిలాంటి ప్రాంతంలో ఊరికి దూరంగా ఉండే పెద్ద బంగ్లాలో అలెక్స్ పేరెంట్స్ ఉంటుంటారు. సన్నీ, అలెక్స్ ఇంటికి చేరుకునేసరికి అర్థరాత్రి అవుతుంది. కొంతసేపటి తర్వాత ఆ ఇంట్లోకి ఒక సైకో వచ్చి అలెక్స్ పేరెంట్స్ ను చంపేసి, అలెక్స్ ను ఎత్తుకెల్తాడు. అంతేకాకుండా కనిపించిన ప్రతఒక్కరిని చంపేస్తుంటారు. ఇంతకి ఆ సైకో ఎవరూ... అతనికి వీళ్లకి ఏంటి సంబంధం.. సైకో నుంచి సన్నీ, అలెక్స్ లు తప్పించుకున్నారా.. లేదా అన్నది మిగతా కథ.

సాంకేతికాంశాలు
కథ-కథనం: కథ పరంగా చాలా బాగున్న కాన్సెప్ట్ ఇది. అయితే కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది. అక్కడక్కడ కథకు లింక్స్ తెగిపోయాయి.

సంభాషణలు: సంభాషణలు పర్వాలేదనిపించాయి. ‘‘మగవాడితోనే ఆడదాని లైఫ్ పుల్ ఫిల్ అవుతుంది’’ వంటి డైలాగ్స్ కి థియేటర్ లో విజిల్స్ పడతాయి.

సంగీతం-పాటలు:  ఉన్నవి 3 పాటలే అయినా వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆవరేజ్. అది కాస్త బాగుంటే సినిమా మూడ్ కరెక్టుగా క్యారీ అయ్యేది.

ఎడిటింగ్: ఎడిటింగ్ బాగుంది. ఎడిటర్ కి ఇది మొదటి సినిమా అయినా... షార్ప్ కట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించాడు.

కెమెరా: కెమెరా వర్క్ చాలా బాగుంది. అవసరమైన చోట్ల 5డిరెడ్ మరియు ఫాంథమ్ (ఫ్లై కామ్) వంటి కెమెరాను వాడారు.

నటన: ఇలాంటి సబ్జెక్టును ఒప్పుకున్నందుకు ప్రశాంతిగీతాంజలిలను ముందుగా అభినందించాలి. విచిత్రమైన క్యారెక్టర్‌ లో ప్రశాంతి తన నటనను కనబరిచగా.. గీతాంజలి కూడా నటన కూడా బాగుంది.  ఇక ఈ సినిమాలో ముఖ్యమైనది శ్రీ రాజన్ వేసిన సైకో పాత్ర.. ఆ పాత్ర గెటప్ నిజమైన సైకోని తలపించింది. నటన కూడా అంతకుతీసిపోలేదు. సైకో అంటే నిజంగా ఇలానే ఉంటాడా అన్న రీతిలో శ్రీ రాజన్ నటన ఉంటుంది. మిగతా పాత్రలు, ధన్ రాజ్ బ్యాచ్ నటన కూడా ఆకట్టుకుంటుంది.

దర్శకత్వం: మొదటి సినిమా అయినా ఎక్కడా అది కనిపించలేదు. కథను ఆసక్తికరంగా చెప్పడంలో మరియు నటీనటులను, సాంకేతిక నిపుణులను సినిమాకు అవసరమైన విధంగా ఉపయోగించుకోవడంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ అనే అంశంలో ఎక్కడ అసభ్యకరం అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. లోకేషన్స్ ను మరియు వివిధ రకాల కెమెరాలను అనుగుణంగా వాడుకున్నాడు. దర్శకత్వం పరంగా ధన్‌రాజ్‌తో చేయించిన కామెడీలో దర్శకుడి టైమింగ్ బాగుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలలో చాలా కృరత్వం ఎక్కువగా ఉండి, ఒక్కొక్కరిని ఒక్కోరకంగా చంపండం హింసాత్మకంగా ఉంటుంది. అయితే ఇలాంటి తరహా చిత్రాలను చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది.

చివరగా: విభిన్నమైన కథను ఎంచుకొని తక్కువ బడ్జెట్ లో సినిమా తీయడమే కాక, ఆ సినిమాను దాదాపు 150 సెంటర్స్ లో విడుదలచేయించుకున్నదర్శకుడిని ప్రతిభను మెచ్చుకోవాలి. అయితే ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ అనేది ఇంకా తెలుగు సినిమారంగానికి రాలేదు. దాంతో సెన్సార్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురై, కొన్ని సన్నివేశాలను తొలగించారనిపిస్తుంది. దాంతో సన్నివేశాలమధ్య లింక్స్ తెగిపోయి కథనంలో కాస్త తడబాటు జరిగింది.

40-60 కోట్ల బడ్జెట్ తో తీసే పెద్ద సినిమాలకు కనీసం పెట్టినదాంట్లో సగం కూడా రాలేని పరిస్థితి ఉన్నఈ రోజుల్లో... 10 లక్షల లోపు బడ్జెట్ తో సినిమా తీసి ఇటు నిర్మాతకి, అటు పంపిణిదారులకు లాభాలను తెచ్చివ్వడమన్నది ఆహ్వనించదగ్గ పరిణామం. ఎప్పుడూ పెద్ద సినిమాలనే కాకుండా ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరిస్తే.. ముందుముందు మరిన్ని చిత్రాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

శ్రీరాజన్ప్రశాంతిగీతాంజలిధన్ రాజ్రాకేష్సాయిరాజ్షాని సాల్మోన్పుచ్చా రామకృష్ణహరితఫణిసంపత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచంకెమెరా: కర్ణ ప్యారసానిడెలాగ్స్: అనిల్ సిరిమల్లసంగీతం: శేషు కె.ఎం.ఆర్.నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ,కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్.

విడుదల తేదీ: 27 నవంబర్ 2015
రేటింగ్‌: 3/5 (ఇది నా అభిప్రాయం మాత్రమే)

No comments:

Post a Comment