Sunday, August 14, 2016

'బెంగాల్‌ టైగర్' రివ్యూ



కొన్నికొన్ని సార్లు మనం ఎంత కష్టపడ్డా.. అదృష్టం అనేది లేకపోతే ఆ కష్టమంతా వృధా అవుతుంది. కాని అదృష్టమనేది ఉంటే మనం కొంత కష్టపడ్డా ఎక్కువ ఫలితం లభిస్తుంది. అలాంటిదే ‘‘బెంగాల్ టైగర్’’ సినిమా విషయంలో రుజువైంది. ఎప్పుడో ద‌స‌రాకు రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇతర సినిమాలవల్ల రెండు మూడుసార్లు వాయిదా ప‌డుతూ రావడం... ముందు విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాపవ్వడం... పెద్ద సినిమాలు పోటిలేని సమయంలో విడుదలచేయడం బెంగాల్ టైగర్ కు బాగా కలిసొచ్చింది. డిసెంబర్ 10న విడుదలైన బెంగాల్ టైగర్ ఈ కలిసొచ్చిన అదృష్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుందో తూఫాన్ డైలీ.కామ్ స‌మీక్షలో చూద్దాం.

కథ
ఆకాష్ నారాయ‌ణ (రవితేజ) రాజ‌మండ్రి ద‌గ్గర్లోని ఓ ప‌ల్లెటూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకొస్తాడని డిసైడ్ అయిన ఇంట్లో వాళ్లు పెళ్లి చూపులకు తీసుకెలుతారు. అక్కడ పెళ్లి కూతురు తాను పెళ్లి చేసుకునే వాడు ఫేమ‌స్ అయ్యి ఉండాల‌ని.. నువ్వు ఫేమ‌స్ కాదని ర‌వితేజ‌ను రిజ‌క్ట్ చేస్తుంది. ఎలాగైన ఫేమస్ అవ్వాలనుకున్న ఆకాష్ ఎన్నికల ప్రచార మీటింగ్‌ లో మంత్రి (షియాజీ షిండే) ని రాయితో కొడతాడు. ఆకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. దాంతో ఆకాష్ మీడియాలో హైలెట్ అవుతాడు. మినిస్టర్, పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆకాష్ దగ్గరకు వెళ్లి త‌న‌ను ఎందుకు కొట్టావ‌ని అడిగితే….తాను పాపుల‌ర్ అయ్యేందుకు కొట్టాన‌ని చెప్పడంతో అతడి ధైర్యాన్ని చూసి త‌న వ‌ద్దే ప‌నికి పెట్టుకుంటాడు. త‌ర్వాత హోం మినిస్టర్ (రావూ ర‌మేష్‌) కుమార్తె శ్రద్ధ (రాశీఖ‌న్నా) కు ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉండ‌డంతో రాశీఖ‌న్నాను కాపాడి ఆమె సాయంతోనే వాళ్లింట్లో ప‌నిలో కుదురుతాడు. అప్పటికే రాశీఖ‌న్నాకు పెళ్లి కుదురుతుంది. తన తెలివితో ఆ ఇంట్లో వాళ్లందరినీ తనవైపు తిప్పకొని హోం మినిస్టరే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఆకాష్ తో పెళ్లి ఎనౌన్స్ చేసేలా చేస్తాడు. తీరా ఎనౌన్స్ చేశాక తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని సీఎం అశోక్ గజపతి (బొమ‌న్ ఇరానీ) కూతురు మీరా (తమన్నా) ను ప్రేమిస్తున్నాని ఆకాష్ ట్విస్ట్ ఇస్తాడు. అప్పటివ‌ర‌కు త‌న‌కు ప‌రిచ‌య‌మే లేని త‌మ‌న్నాను ప్రేమిస్తున్నాన‌ని ఆకాష్ ఎందుకు చెప్పాడు. అస‌లు సీఎంపై ఆకాష్ ఎందుకు ప‌గ‌ప‌ట్టాడు ఆకాష్ గ‌తానికి సీఎంకు ఉన్న సంబంధం ఏంటి అన్నది మిగిలిన స్టోరీ.

సాంకేతికాంశాలు
కథ-కథనం: కథ పాతదే అయినా కథనం బాగుంది. అయితే కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. మొదటి భాగం ఉన్నంత ఇంట్రెస్ట్ గా రెండవ భాగం లేదు. రొటీన్ గా అనిపిస్తుంది.

సంభాషణలు: డైలాగ్స్ బాగున్నాయి. సెలబ్రెటీ శాస్త్రీ (పోసాని)ఫృద్విరవితేజల మధ్య వ‌చ్చిన కామెడి సీన్లలో పంచ్ లు పేలాయి. ‘‘నీకు భయంలేదా... దానితో నాకంత పరిచయం లేదు’’.. ‘‘ నేను complaints తో పైకి రాలేదు content తో వచ్చా’’ వంటివే కాకుండా వీలైనన్ని చోట్ల ప్రాసలతో కూడిన డైలాగ్స్ ఉన్నాయి. మధ్యమధ్యలో అత్తరింటికి దారేది, శ్రీమంతుడు సినిమాలలోని కొన్ని సీన్లు స్కూప్ చేశారు.

సంగీతం-పాటలు: సినిమాలో పాటలునేపధ్య సంగీతం రెండూ బాగున్నాయి. ఆర్ ఆర్ చాలా చోట్ల హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఎలివేట్ చేసింది.

కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.  పాటలు రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

నటన: రవితేజకు ఈ పాత్ర కొత్తదేమీ కాదు.. ఆయనే చాలా సార్లు చేసిందే. కానీ కెరీర్ ప్రారంభంలో ఉన్న అదే ఎనర్జీ ని ఇప్పటివరకూ మెయింటైన్ చేయటం మాత్రం మూమాలు విషయం మాత్రం కాదు. అయితే ఈ సినిమా కోసం ర‌వితేజకు బాగా మేక‌ప్ వేసినా చాలా చోట్ల వ‌య‌స్సు పైబ‌డిన విష‌యం స్పష్టమైంది.   సినిమాలో రవితేజ గ్లామర్ ని సిజితో కవర్ చేస్తే...మరో ప్రక్కన రాశి ఖన్నాతమన్నా తమ గ్లామర్ తో అదరకొట్టారు. రాశి ఖన్నా అయితే ఫెరఫార్మెన్ కన్నా గ్లామర్ కే ప్రయారిటీ ఇస్తూ బికినిలో కనపించి మరీ వేడిక్కించింది. అమలాపాల్ గా బ్రహ్మానందం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. హీరో ప్రెండ్ గా షకలక శంకర్ కనిపించాడు కాని పెద్దగా నవ్వించలేకపోయాడు. సిఎం గా బొమన్ ఇరాని సూపర్ గా చేసాడనే చెప్పాలి. ఈ సినిమాతో నెగెటివ్ రోల్ లో మెప్పించాడు. ఈ సినిమాలో ప్యూచర్ స్టార్ గా పృద్వీ ..ఒంటిచేత్తో నిలబెట్టాడు. బాగా నవ్వించి..నిజంగానే టాలీవుడ్ ఫ్యూచర్ సినిమా కమిడయన్ అనిపించాడు. సెలబ్రిటీ శాస్త్రీగా పోసాని కృష్ణమురళి కామెడీ పండించారు.

దర్శకత్వం: తీసుకున్న కథ పాతదే అయినా ఫ‌స్ట్‌ హాఫ్‌ లో ప్రేక్షకుల‌ను మెప్పించాడు. కాని సెకండాఫ్‌లో పూర్తిగా తేలిపోయింది. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే రొటీన్ గా అనిపిస్తుంది. సాగదీస్తున్న ఫీలింగ్ ని తీసుకు రావడమే కాకుండా ఊహాజనితంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా ముందుగానే ఊహించొచ్చు. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేంత కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఉందికానీ సెకండాఫ్ లో ఆ ఫ్లేవర్ పెద్దగా కనిపించలేదు.. ప్లాష్‌బ్యాక్‌హీరో క్యారెక్టరైజేష‌న్ ఎలివేట్ చేసే విష‌యంలో దర్శకుడిని అభినందించొచ్చు. 


చివరగా: ర‌వితేజ అంటే మాస్ ఆడియెన్స్ కు పండ‌గ లాంటిదే.  సినిమాలో లెక్కనేనంత బిల్డప్, లెక్కలేనన్ని పంచ్ డైలాగ్ లు, యాక్షన్ సీన్లు ఉన్నాయి. వీటన్నింటిని మాస్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్.. వరసపెట్టి కామెడీ సీన్స్ తో సాగిపోయినా సెకండాఫ్ లో యాక్షన్ కే పరిమితమైంది. ఫస్టాఫ్ లో ఉన్న పోసాని - పృధ్వీల కామెడీని సెకండాఫ్ లో కంటిన్యూ చేస్తే బాగుండేది. ప్రతి అమ్మాయి తనకు కాబోయే వాడు ఏ ఇంజనీరో లేదా ఏ డాక్టరో లేదా బాగా డబ్బున్నవాడో అయుండాలని కోరుకుంటున్న ఈకాలంలో.... తాను పెళ్లి చేసుకునే వాడు ఫేమ‌స్ అయ్యి ఉండాల‌ని పెళ్లి చూపుల సీన్ లో పెళ్లి కూతురు తన కోరికను రవితేజకు చెప్పడం బాగుంది. ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ అదిరింది... ఇంటర్వెల్ బ్యాంగ్ కేక అనుకున్న ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. టోటల్ గా బెంగాల్ టైగర్ above average.... అయితే కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఇష్టపడే మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.

బ్యాన‌ర్‌: శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌,
నటీనటులు: ర‌వితేజ‌త‌మ‌న్నారాశిఖ‌న్నాబోమ‌న్ ఇరానిబ్రహ్మనందంరావు ర‌మేష్‌షియాజి షిండేనాజ‌ర్‌పోసాని కృష్ణముర‌ళిత‌నికెళ్ళ భ‌ర‌ణిహర్ష వ‌ర్ధన్ రానేపృద్విసురేఖ వాణిఅక్ష‌శ్యామ‌ల‌ప్రియ‌, ప్రభుప్రగ‌తినాగినీడుప్ర‌భ‌ర‌మాప్రభ తదిత‌రులు
కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌ఎడిట‌ర్‌: గౌత‌ం రాజుఆర్ట్‌: డి.వై .స‌త్యనారాయ‌ణ‌ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌సంగీతం భీమ్స్‌నిర్మాత‌:కె.కె. రాధామెహ‌న్‌,
క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 151 నిమిషాలు
బిజినెస్‌:(ఎస్టియేష‌న్‌): రూ.26 కోట్లు
విడుదల తేదీ: 10 డిసెంబ‌ర్‌2015
రేటింగ్‌: 2.5/5 (ఇది నా అభిప్రాయం మాత్రమే)

No comments:

Post a Comment