Sunday, August 14, 2016

‘‘చెంబు చినసత్యం’’ భయపడుతూ.. నవ్విస్తాడు...




అతని పేరు సత్యంఅతనో LIC Agent. రాత్రివేళలో అతనికి వచ్చిన కల మరునాటికి నిజం అవుతుందిఒకనరోజు తన కుటుంబ సభ్యులు చనిపోతారనికల వస్తుంది.  అలాంటి పరిస్థితుల్లో తన వాళ్ళను ఎలా కాపాడుకున్నాడు.. తనవాళ్ళను  కాపాడుకోడానికి సత్యం ఏంచేశాడనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం చెంబు చినసత్యంLIC Agent అనేది ఉపశీర్షిక .ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు నామాలరవీంద్రసూరినిర్మాత ఆలూరి సాంబశివరావు గార్లతో తుఫాన్ డైలీ ముచ్చటించింది....


దర్శకుడు నామాల రవీంద్రసూరి గారితో
  • నమస్కారం రవీంద్రసూరి గారు...
నమస్కారమండి...
  • మీ సినిమా రిలీజవుతుంన్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు...
థ్యాంక్సండి.
  • మీ గురించి చెప్పండి..?
మాది నల్లగొండ జిల్లా నూతన్ కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంస్కూల్ చదువు వరకు నూతన్ కల్ లో చదివిన నేను.. ఇంటర్డిగ్రీసూర్యాపేటలో చేశానుచిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టంస్కూల్ ఎగ్గోట్టి ఫెండ్స్ తో కలిసి సైకిల్ పై 25 కిలోమీటర్లు ఉన్న సూర్యాపేటకువెళ్ళేవాణ్ణిపి.జికోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో ఎం.., ఎం.ఫిల్ చేశాను.
  • మీరు రైటర్ అని విన్నామునిజమేనా ?
అవునండి.. ఇంటర్ చదివే సమయంలోనే కథలుకవితలు రాసేవాడిని.
  • మరి రైటర్ గా ఎవరి దగ్గరైనా చేశారా..?
ఎల్.బిశ్రీరాం గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానునేను జాయిన్ అయిన కొన్ని రోజులకే తను నటుడిగా బిజీ అయ్యారుదాంతోఆయన దగ్గరి నుండి వచ్చేశాను.
  • రైటర్ గా ఏవన్న ప్రాజెక్టులు చేశారా..?
ఎల్.బిశ్రీరాం గారి దగ్గర ఉన్నప్పుడే ఒక సీరియల్ కి రాశాను తర్వాత చాలా సినిమాలకుసీరియల్స్ కు రైటర్ గా చేశాను.
  • రైటర్ గా ఉన్న మీకు డైరక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది..?
రైటర్ గా ఎంతోమందికి కథలు వినిపించానుఅవుట్ పుట్ చూసేసరికి నేను చెప్పినట్టుగా  డైరెక్టర్ తీయలేదనిపించేదిఅలాచాలాసార్లు జరగడంతో నా కథను నేనే డైరెక్ట్ చేసే బాగుంటుందనిపించింది.
  • నిర్మాతకి ఇది మొదటి సినిమా అని తెలిసిందిఅతన్ని మీరు ఎలా ఒప్పించగలిగారు..?
ఒక ఫ్రెండ్ ద్వారా సాంబశివరావు గారు పరిచయం అయ్యారుసినిమా తీయాలనే కోరికతో ఉన్న ఆయనకు నా కథను వినిపించాను. కథనచ్చి ఒక డెమో చూపించమన్నాడుఅందుకోసం 6th Sence అనే షార్ట్ ఫిలీం తీశానుదాంతో ఆయనకు నాపై నమ్మకం కుదిరి సినిమాకు అవకాశంఇచ్చారుచిత్రీకరణలో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
  • ఇపుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం youthful, love, romantic వంటి అంశాలతో కాకుండా ఇలా కుటుంబ కథాచిత్రాన్నితీస్తున్నారు కదా.. ఏదైనా కారణం ఉందా..?
అందరిలా ట్రెండ్ ని ఫాలో అవడం కాకుండా కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో కుటుంబ నేపథ్యంతో సినిమా తీయడం జరిగింది.
  •  వర్గాల ప్రేక్షకులకు మీ సినిమా నచ్చే అవకాశం ఉంది..?
ఒక వర్గంకోసం తీసిన సినిమా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు  సినిమా నచ్చుతుందిమధ్య తరగతి కుటుంబాలకు కనెక్టుఅయ్యేవిధంగా హీరో పాత్ర LIC Agent గా పెట్టడం జరిగిందిజరుగుతున్న కథలో హీరోకి భయంగాచూసే ప్రేక్షకులకు ఫన్ గా ఉంటుంది.
  • సుమన్ శెట్టికిచెంబు చినసత్యం టైటిల్ కి ఏదైనా సంబంధం ఉందా..?
సుమన్ శెట్టితో నాకు చాలాకాలం నుండి పరిచయం ఉందిఒకరోజు తనకి  కథను వినిపించానుతనకి నచ్చి చేస్తానని ముందుకువచ్చాడు. అలా తను ఓకె అయ్యాక టైటిల్ ను నిర్ణయించడం జరిగింది.
  • మీ నటీనటుల గురించి చెప్పండి..?
హీరోయిన్ కన్నడ అమ్మాయిచాలా ఫర్ పెక్టుగా సరిపోయిందిసెకండ్ హీరోగా శరత్హీరో ఫ్రెండ్ పాత్రలో సూర్య నటన బాగుంటుంది.
  • మరీ టెక్నిషియన్స్...?
ఎడిటర్ ఆవుల వెంకటేష్ నాకు మంచి మిత్రుడుతను ఒక ఎడిటింగ్ లోనే కాకుండా పోస్ట్ ప్రోడక్షన్ విషయాలలో కూడా చాలా సహాయంచేశాడు ఫిల్మ్ బై అరవింద్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల  చిత్రానికి సంగీతం అందించారుహార్రర్ మ్యూజిక్ చేసే వారికోసం చూస్తున్నసమయంలో విజయ్ ని కలిసి కథ వినిపించడం జరిగిందికథ నచ్చి తను చేస్తానని ముందుకువచ్చాడుమౌనశ్రీ మల్లిక్ చాలా చక్కని సాహిత్యాన్నిఅందించారుకెమెరా వర్క్ కూడా అద్బుతంగా వచ్చింది.

నిర్మాత ఆలూరి సాంబశివరావు గారితో:

  • మొదటిసారిగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారుమీ నేపథ్యం చెప్పండి..?
బి.ఎస్.ఎన్.ఎల్లో ఉద్యోగం చేసివాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానుఇంటర్ చదివే రోజుల్లోకెమెరామెన్ సీటుకోసం అడియార్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో మరియు పూణే  ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో అప్లై చేశానుకాని సీటు రాలేదుఅయినాకానిసినిమారంగంపై కోరిక మాత్రం తగ్గలేదు.
  • సినిమా రిలీజ్ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతమంది పెద్దవాళ్ళ చేతుల్లో ఉందిఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా విడుదలకావడం చాలా కష్టం.నిర్మాత,డిస్టిబ్యూటర్ఎగ్జిబ్యూటర్ ఒకరే అయితే తప్ప చిన్న సినిమాలు ప్రేక్షకులకు అందడంలేదు.
  • మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడు ఆదరిస్తారు. మీ విజయవంతంకావాలని కోరుకుంటూ.. మీ సమయాన్ని మా తుఫాన్ డైలీకోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ...

No comments:

Post a Comment