Monday, December 23, 2024

రోజుకో వ్యాసం.. ప్రణయ విన్యాసం (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా, 21.12.2024)


 ‘వికీపీడియా’… ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషలు, లక్షలాది వ్యాసాలతో అంతర్జాలంలో అలరారుతోంది. తెలుగు భాషలో విజ్ఞానాన్ని పంచేందుకు కొందరు తెలుగు వికీపీడియన్ల కృషితో రూపొందుతున్న స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.

యాదాద్రి జిల్లా మోత్కూరులోని చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ప్రణయ్‌రాజ్ వంగరి తెలుగు వికీపీడియాలో 365 రోజుల్లో 365 వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సాధించారు.

తెలుగు వికీపీడియాలో 7,903 వ్యాసాలు

2013 మార్చి 8న వికీపీడియాతో లాగిన్ అయ్యారు. తొలుత తెలుగు నాటకరంగానికి సంబంధించిన వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అలా అనేక రంగాలను ఎంచుకుని వ్యాసాలు రాస్తూ తొలుత వందరోజుల్లో వందవ్యాసాలు రాశారు. ఇలా.. 365 వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సాధించారు. 2024 నవంబరు 243 వేల రోజుల్లో 7,903 వ్యాసాలను రాసి మరో సరికొత్త రికార్డును సాధించారు.

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ప్రాజెక్టులో

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీ మీడియా ఫౌండేషన్లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి తెలంగాణలోని సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టును రూపొందించారు.

 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సాంస్కృతిక ఫొటోలు, వీడియోలను.. భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన తెలంగాణ నేపథ్య, చారిత్రక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన 70 పుస్తకాలను భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిత్రించిన తెలంగాణ తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలను పబ్లిక్ డొమైన్ లోకి విడుదల చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖలో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న ప్రణయ్‌రాజ్ ఈ ప్రాజెక్టుకు వికీపీడియన్ గా ఇన్ రెసిడెన్స్ గా పనిచేశారు. ఈ ప్రాజెక్టులో ఏడువేల ఫొటోలను (తగిన పేరు, తెలుగు వివరణ, వర్గీకరణ, ఇతర అవసరమైన మెటాడేటాతో కలిపి), పుస్తకాలను, తైలవర్ణ చిత్రాలను ప్రణయ్‌రాజ్ వికీపీడియా కామన్స్లోకి అప్లోడ్ చేశారు. వీటిని ఎవరైనా కామన్స్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెంకయ్యనాయుడి ప్రశంసలు

తెలుగుకు సముచిత స్థానం కల్పిస్తూ.. తెలుగు వికీపీడియాలో ప్రపంచ రికార్డు సాధించిన ప్రణయ్రాజ్ను నాడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ లో  అభినందించారు. అప్పటి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో అభినందించి తన కార్యాలయానికి పిలిపించుకుని సన్మానించారు. వికీపీడియా సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసఫ్ హైదరాబాద్ లో ప్రణయ్‌రాజ్ ను అభినందిస్తూ ప్రపంచ రికార్డుగా ప్రకటించడం విశేషం. ఈనెల 19 నుంచి 29 వరకు నిర్వహించనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని తెలుగు వికీపీడియా స్టాల్ ను సంప్రదించాలని ప్రణయ్‌రాజ్ కోరారు.


 

 




  1. ఒరిజినల్ పేజీ లంకె (వెబ్ పేపర్)
  2. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)

 

 

Saturday, August 31, 2024

తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరి (ఈనాడు, హైదరాబాదు జిల్లా, 29.08.2024)

రవీంద్రభారతి: నాటకరంగ పరిశోధకుడు, రేపటి తెలుగు సంస్థ ప్రతినిధి ప్రణయ్‌రాజ్ వంగరి పదకొండేళ్లుగా అంతర్జాలం వేదికగా తెలుగు వ్యాప్తికి కృషిచేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న తలంపుతో 2013, మార్చి 8న తెలుగు వికీపీడియాలో చేరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, కళలు, సంస్కృతి, పర్యాటక- ఆధ్యాత్మిక ప్రాంతాలకు సంబంధించి ఇప్పటివరకు 7600కు పైగా వ్యాసాలను రాసి విజ్ఞాన సర్వస్వాన్ని భాషాభిమానుల చెంతకు చేరుస్తున్నారు. ఏడాదిలో 365 వ్యాసాలు రాసి వికీపీడియాలో ప్రపంచ రికార్డు సృష్టించారు.

 

 


  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)



2,910 రోజుల్లో 7,620 వ్యాసాలు.. (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా, 29.08.2024)

మోత్కూరుకు చెందిన తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరి. 2,910 రోజుల్లో 7,620 తెలుగు వ్యాసాలను రాసి వికీపీడియాలో పొందుపరిచి ఔరా అనిపించారు. నేటి యువతకు తెలంగాణ సంస్కృతి, భాష, యాస, మాండలిక ప్రాధాన్యాన్ని వివరిస్తూ వికీపీడియాలో తొలుత ఆయన వందరోజుల్లో వంద వ్యాసాలు, 365 రోజుల్లో 365 వ్యాసాలు ఇలా.. రోజుకో వ్యాసం రాస్తూ పొందుపరిచాడు. తెలంగాణలోని వ్యక్తులు, గ్రామాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలవారికి అందించే ప్రయత్నంలో ఈ వ్యాసాలు రాస్తున్నారు. 11 ఏళ్లుగా చేస్తున్న ఈ కృషికి పలు అవార్డులు అందుకున్నారు. 2019లో ఐస్టాండ్ ఫర్ ది నేషన్-శ్రేష్ట సేవా పురస్కారం పొందారు.





  1. వెబ్ ఆర్కైవ్ లో పేజీ లంకె (వెబ్ పేపర్)

Tuesday, March 28, 2023

తెరపడే నాటకరంగానికి జీవం (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా, 27.03.2023)

తెరపడే నాటకరంగానికి జీవం
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
(ఎస్.ఎన్. చారి, ఈనాడు జర్నలిస్టు, మోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా, 27 మార్చి 2023)


 Web Link: https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123053738

Web Archive Link: https://web.archive.org/web/20230327103902/https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123053738

Thursday, January 12, 2023

లక్ష్య సాధకులు - పురస్కారాల వికీపీడియన్ (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా, 12.01.2023)


మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. మోత్కూరుకు చెందిన ప్రణయ్ రాజ్ వంగరి వికీపీడియన్ గా రోజుకొకటి చొప్పున 2017లో ఏడాది పాటు వరుసగా 365 కథనాలు రాసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 2022లో మొత్తంగా 850 వ్యాసాలు రాసి వికీపీడియాలో పొందుపరుస్తూ తన రికార్డును తానే అధిగమించారు. ఈయన 2016 నుంచి తెలుగు వికీపీడియాలో రోజుకో వ్యాసం రాస్తున్నారు. 2016 జూన్ లో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి వికీపీడియన్ సదస్సుకు అధికారికంగా హాజరయ్యారు. 2016 సెప్టెంబరులో మన దేశంలోని చండీగఢ్ జరిగిన ప్రపంచ స్థాయి సదస్సుకు అధికారికంగా హాజరై పలువురి ప్రశంసలు, అవార్డులందుకున్నారు. '2022 డిసెంబరు నాటికి 80 వేలకు పైగా తెలుగు వ్యాసాలు వికీపీడియాలోకి చేరాయ'ని ప్రణయ్ రాజ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 గ్రామాలు, 1,277 మండలాలకు చెందిన పేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.

Web Link: https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123007263

Web Archive Link: https://web.archive.org/web/20230112055931/https://www.eenadu.net/telugu-news/districts/Nalgonda/534/123007263

Friday, December 23, 2022

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్, 23.12.2022)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ అంధ్రప్రదేశ్)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ హైదరాబాదు)

20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా (ఈనాడు మెయిన్ తెలంగాణ)

 





20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా
నెలకు 15 లక్షల మంది వీక్షణ
25న ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు

ఊళ్లు.. ప్రముఖ వ్యక్తులు.. చారిత్రక కట్టడాలు.. ప్రదేశాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా.. ఠక్కున గుర్తుకొచ్చేది వికీపీడియా. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. 20వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో తెలుగు వికీపీడియన్లందరూ కలిసి వేడుకలు నిర్వహించనున్నారు. తప్పుల్లేకుండా రాయగలిగితే చాలు.. ఎవరైనా వికీపీడియాలో వ్యాసాలు పొందుపరచవచ్చు. వ్యాసాలు, ఫొటోలను అభివృద్ధి చేసేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తుంటారు. ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతులు, అవార్డులు అందిస్తుంటారు.

ఎన్నో ప్రత్యేకతలు..
* తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 వేల గ్రామాల సమాచారంతో పేజీలున్నాయి.
* 1277 మండలాలకు చెందిన పేజీలు అందుబాటులో ఉన్నాయి.
* 2016లో తెలంగాణ, ఈ ఏడాది ఏపీలో జరిగిన జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సమాచారం సైతం అందుబాటులో ఉంది.
* ఆయా జిల్లాలు, మండలాల భౌగోళిక పరిస్థితిని ప్రతిబింబించేలా ప్రభుత్వ అధికారిక సమాచారం సేకరించి నిక్షిప్తం చేశారు. దాదాపు 60 వేల పేజీల గ్రామ, మండల, జిల్లాల సమాచారాన్ని పొందుపరిచారు.
* సినిమాలకు సంబంధించి దాదాపు ఏడు వేల వ్యాసాలు రాశారు. ఇవి 15 వేల పేజీల్లో నిక్షిప్తమయ్యాయి.

మారుమూల సమాచారం లభ్యం
- వి. ప్రణయరాజ్, తెలుగు వికీపీడియన్

వికీపీడియాలో సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు. ఫొటోలు అప్లోడ్ చేయవచ్చు. అందుకే మారుమూల ప్రాంతాల సమాచారం, ఫొటోలు లభ్యమవుతున్నాయి. ఇందులోని వ్యాసాలను పుస్తకంగా ప్రింట్ చేసుకోవచ్చు.. అమ్ముకోవచ్చు. ఇందుకు వికీపీడియాకు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. కేవలం ‘వికీపీడియా నుంచి తీసుకున్నాను' అని రాస్తే సరిపోతుంది.

News Link: https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/122238812

Web Archive Link: https://web.archive.org/web/20221223043907/https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/122238812