మోత్కూరుకు చెందిన తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరి. 2,910 రోజుల్లో 7,620 తెలుగు వ్యాసాలను రాసి వికీపీడియాలో పొందుపరిచి ఔరా అనిపించారు. నేటి యువతకు తెలంగాణ సంస్కృతి, భాష, యాస, మాండలిక ప్రాధాన్యాన్ని వివరిస్తూ వికీపీడియాలో తొలుత ఆయన వందరోజుల్లో వంద వ్యాసాలు, 365 రోజుల్లో 365 వ్యాసాలు ఇలా.. రోజుకో వ్యాసం రాస్తూ పొందుపరిచాడు. తెలంగాణలోని వ్యక్తులు, గ్రామాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలవారికి అందించే ప్రయత్నంలో ఈ వ్యాసాలు రాస్తున్నారు. 11 ఏళ్లుగా చేస్తున్న ఈ కృషికి పలు అవార్డులు అందుకున్నారు. 2019లో ఐస్టాండ్ ఫర్ ది నేషన్-శ్రేష్ట సేవా పురస్కారం పొందారు.
No comments:
Post a Comment