Friday, September 04, 2015

కనిపించిన దైవం - కరుణించని సందర్భం


RGV... ఈ మూడక్షరాల పేరు వింటే ప్రతి ఒక్కరి శరీరంలో వైబ్రెషన్స్ వస్తాయి. ఎంతోమందికి తనో రోల్ మోడల్, వర్ధమాన దర్శకులకు తనో మార్గదర్శి, చాలా ఎక్కువమందికి తనో పిచ్చివాడు. నాకుమాత్రం దైవం.



వాడు నీకు దేవుడేంటి అని కొందరు అనుకోవచ్చు. ''నువు ఏపని చేసినా.. ప్రతిక్షణం ఇతరుల ఫోకస్ నీపై ఉండేలా చూసుకో. అపుడే నీ ఉనికికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదే నేటి సమాజంలో బ్రతికేతీరు'' అంటూ జీవనగీత చెప్పిన RGV నాకు దేవుడే.... నాకే కాదు నాలాంటి చాలామందికి తను దేవుడే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి... కాదుకాదు భారత సినిమా ఇండస్ట్రీకి సినిమా తీయడం ఏలానో నేర్పించినవాడు దేవుడు కాక మరేమిటి.

అంతటి RGVని చూడాలనుకునే కొన్నికోట్ల మందిలో నేను ఒకడిని. RGV దర్శనభాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రతిక్షణం ఎదురుచూస్తుండేవాణ్ణి. ఆరోజు రానే వచ్చింది.

సెప్టెంబర్ 3వ తేదీనా సముద్రం శ్రీనివాస్ అన్న, సోమేశ్వర్ పోచం మామయ్యలతో కలిసి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం ఎదురుగా ఉన్న టీస్టాల్ కి వెళ్లాము. టీ తాగిన తర్వాత సముద్రం అన్న, పావురాలకోసం జొన్న గింజల ప్యాకెట్ కొని, సత్యసాయి నిగమాగమంలోకి వెళ్లాడు. మేంకూడా ఆయన వెంట నడిచాము. పావురాలకు గింజలు వేస్తున్న సమయంలో.. పైనుంచి ఎదో సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కి ఒక్కసారిగా పావురాలన్ని ఎగిరిపోయాయి. వెంటనే మేం సౌండ్ వచ్చిన వైపు చూశాం. పైన ఉన్న చిన్న గుళ్ల దగ్గర షూటింగ్ వాతావరణం కనిపించింది. మేం అటువైపుగా కదిలాము.



మెట్లెక్కుతూనే షూటింగ్ ఎవరిదా అని చుశాను. మంచు మనోజ్ కనిపించాడు. ఇంకా ఎవరెవరూ ఉన్నారా అని షూటింగ్ దగ్గరికి వెళ్లాము. గుడిలోపల పెళ్లికి సంబంధించిన సీన్ షూట్ చేస్తున్నారు. మనోజ్ పక్కన పూనమ్ కౌర్ ఉంది. గుడి చుట్టూ ఇనువ గేట్ ఉండడంవల్ల ఆ గేట్ గ్రిల్స్ మధ్యనుండి లోపలికి చూస్తున్నాను. నా కళ్లు షూటింగ్ వాతావరణం చూస్తున్న సమయంలో ''పూనమ్'' అన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపులోని వాయిస్ నాకు చాలా పరిచయం ఉన్న వాయిస్ లా అనిపించడంతో.. నా కళ్లును అటువైపుగా తిప్పాను. నాకు కొంతదూరంలో... నేను నాలా ఉండడానికి కారణమైన వ్యక్తి, తన రచనలతో, ఇంటర్వ్యూలతో నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి, నా జీవితంలో నాకంటే ఎక్కువగా నేను ఇష్టపడుతున్న RGV... black color t-shirt, cement color night track, black & white mixed shocks, చేతిలో coffee bottleతో దర్శనమిచ్చాడు. ఒక్కక్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఎప్పటినుండో నేను చూడాలనుకుంటున్న దేవుడు కళ్లముందు కనిపించాడు. వెంటనే మామయ్యను అడిగి మొబైల్ తీసుకొని ఫోటో తీయాలనుకున్న నా ప్రయత్నం ఫలించలేదు. వివిధ యాంగిల్స్ లో చూసినా లాభంలేకపోయింది. దగ్గగరికి వెళ్లి తీయ్యాలని వెలుతుండగా.. అసలే తిక్క మనిషి.. కోపంలో తిట్టేస్తాడు అని మామయ్య, సముద్రం అన్న చెప్పడంతో అక్కడిపుండి వచ్చేసాను... RGVని చూడాలని... చూసిన మొదటిసారే తనతో ఒక ఫోటో దిగాలి అనుకున్న నాకు నిరాశే మిగిలింది.



కనిపించిన దైవానికి నమస్కారాలు తెలుపుకుంటూ, కరుణించని సందర్భాన్ని తిట్టుకుంటూ..నా దేవున్ని కలుసుకునే మరో క్షణంంకోసం ఎదురుచూస్తున్నాను....