Tuesday, August 01, 2017

ఎస్.ఎన్. చారి గారి ప్రస్థానం...

ఎస్.ఎన్. చారి
ఎస్.ఎన్. చారి
SN Chary.jpeg
జననంసోమనర్సింహ్మా చారి చొల్లేటి
జూలై 10, 1957
సూరారం, రామన్నపేట మండలం యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంమోత్కూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధిచిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు మరియు పాత్రికేయుడు
భార్య / భర్తకళావతి
పిల్లలుశివరంజని, శ్వేత, రాంచరణ్ తేజ్, శిరీష
తండ్రిచంద్రయ్య
తల్లిలక్ష్మమ్మ
ఎస్.ఎన్. చారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు మరియు పాత్రికేయుడు.
జననం
ఎస్.ఎన్. చారి 1957, జూలై 10న చంద్రయ్య, లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని సూరారంలోజన్మించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోత్కూర్ మండల కేంద్రంలో నివసిస్తున్నాడు.

వివాహం
ఈయనకు కళావతితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (శివరంజని, శ్వేత, శిరీష), ఒక కుమారుడు (రాంచరణ్ తేజ్)

చిత్రకళారంగం
తన 12వ ఏటనే చిత్రకళలపై ఉన్న ఆసక్తితో అటువైపుగా దృష్టి సారించాడు. ఎన్.టి.ఆర్. నిలువెత్తు కటౌట్ ను ప్రాథమిక దశలోనే వేశాడు. చిత్రకళలో టి.టి.సి.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

కళారంగం
సామాన్య కళాకారునిగా జీవితాన్ని ప్రారంభించిన చారి, అభ్యుదయ కళానిలయాన్ని ప్రారంభించాడు. తన సంస్థ ద్వారా హుష్ కాకి, పద్మవ్యూహం, గప్ చుప్, గజేంద్రమోక్షం, కోహినూర్ మొదలైన నాటికలు ప్రదర్శించాడు.
1989లో అభినయ కళాసమితిని స్థాపించి, మోత్కూర్లో కళారంగ అభివృద్ధికి కృషిచేశారు. మోత్కూర్, ఆలేరు, దేవరుప్పుల, తుంగతుర్తి, కోదాడ, మునిపంపుల, తిర్మలగిరి, తొర్రూర్, ఖమ్మం, కొడకండ్ల, హైదరాబాద్, పాలకుర్తి, జనగాం, వరంగల్, మొండ్రాయి, సూర్యాపేట, భువనగిరి వంటి వివిధ తెలంగాణ ప్రాంత పరిషత్తులలో పాల్గొని...జాగృతి, చీకటి బతుకులు, రేపటి పౌరులు, నవతరం, సందిగ్ధ సంధ్య, కాలగర్భం వంటి నాటికలు ప్రదర్శించారు.
నాటకరంగంలో పాత్రలను పోషించాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు మరియు ప్రత్యేక బహుమతులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నాడు. వివిధ పోటీల్లో న్యాయనిర్ణేతగా పాల్గొని సాంస్కృతిక రంగానికి సేవలు అందించాడు. గ్రామాలలో నిర్వహించే యక్షగానాలు, పౌరాణిక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు.

బహుమతులు
  1. 1987లో వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ స్థాయి పోటీలలో కిట్టిగాడు (హుష్ కాకి), చుట్టం (పద్మవ్యూహం) వంటి హాస్య పాత్రలలో నటించి అప్పటి వరంగల్ కలెక్టర్ ఎ.చెంగప్పచే బహుమతులు అందుకున్నాడు.
  2. 1989లో పోచంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాగభూషణం సమక్షంలో మరియు 1984లో హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర వృత్తి కళాకారుల సదస్సులో అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య, గవర్నర్ రాంలాల్, మంత్రి పి.వి.నరసింహరావు, సినీనటులు జమున, దాసరి నారాయణరావు, ధూళిపాల సమక్షంలో రక్తకన్నీరు నాటకంలోని ఒక ఘట్టాన్ని ఏకపాత్రాభినయంగా నటించి బహుమతి అందుకున్నాడు. రక్తకన్నీరు ఏకపాత్రాభినయాన్ని 75కు పైగా ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నాడు.

పాత్రికేయరంగం
పురస్కారాలు
  1. తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - తెలుగు వికీపీడియా కృషి
స్వర్గీయ శ్రీ ఎన్.టి.ఆర్. గారి నుండి పుస్తకం స్వీకరిస్తూ


Add caption




With Suddala AshokTeja








ఎస్.ఎన్. చారిగారు తయారుచేసి మెమెంటోను చిరంజీవికి అందిస్తూ




గుండు హనుమంతరావుతో (అభినయ కళాసమితి వారోత్సవం, మోత్కూర్, 2-4 ఫిబ్రవరి, 2001)















































Sunday, June 18, 2017

"ఏమో ఏమో యిది నాకేమొ యేమొ ఐనది" (సి. నారాయణరెడ్డి గారి స్వదస్తూరిలోని పాట)



"ఏమో ఏమో యిది నాకేమొ యేమొ ఐనది"
గానం: ఘంటసాల, జానకి
రచన: సి. నారాయణ రెడ్డి
సంగీత దర్శకత్వం: రాజన్ - నాగేంద్ర
చిత్రం: "అగ్గి పిడుగు"
విడుదల: 31- 07- 1964
నిర్మాణ సంస్థ:  విజయా
దర్శకత్వం: బి. విఠలాచార్య.

Courtesy:- పంచకర్ల రమేష్ గారు..


Saturday, May 20, 2017

లండన్ లో డొక్కా సీతమ్మ ఛాయాచిత్రం (రవి పారేపల్లి గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)

డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో వుండేవారు. తమ ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండుగా భోజనం పెట్టేవారట. ఆరోజుల్లో బ్రిటిష్ రాణి , డొక్కా సీతమ్మ గారి గుంరించి విని తన పట్టాభిషేకం సమయానికి సీతమ్మ గారిని తీసుకువెళ్లాలని అలోచించారు. కానీ సీతమ్మ గారు సముద్రం దాటి వెళ్ళరు కనుక, గోదావరి జిల్లా కలెక్టర్ ను సీతమ్మ గారి గ్రామానికి పంపి, ఆమె ఫోటో లండన్ పంపమని కలెక్టర్ ని ఆదేశించారు. కలెక్టర్ గారు సీతమ్మ గారి వద్దకు వెళ్లి ఆమె ఫోటో కోసం అడిగితే వల్ల కాదన్నారు ఆమె. అప్పుడు కలెక్టర్ గారు ఆవిడ కాళ్ళ వెళ్ళా పడి, అమ్మా మీరు నాకు ఫోటో ఇవ్వకపోతే నా వుద్యోగం ఊడుతుందని చెప్పటంతో సీతమ్మగారు ఫోటో తీయించుకున్నారు. ఆ విధంగా సీతమ్మగారి ఫోటో బ్రిటిష్ రాణి వద్దకు లండన్ చేరింది. రాణి తన పట్టాభిషేకం రోజు సీతమ్మగారి ఫోటోను ప్రక్కనే ఉంచుకుని పట్టాభిషేకం చేయించుకున్నారట. మిత్రులు చాలా మంది ఈ ఫోటో చూసి ఉండరు. అందుకోసం ఇక్కడ పొందుపరచడం జరిగింది.